Sreeleela in Tirupati: టాలివుడ్ నటి శ్రీలీల మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉయదం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికి దర్శన ఏర్పట్లు దగ్గరుండి చూసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆమెకు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం శ్రీలీల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఏదైనా పని ప్రారంభించే ముందు శ్రీవారిని దర్శించుకోవడం తనకు అలవాటని తెలిపారు. త్వరలో రాబిన్ హుడ్ మూవీలో నటించనున్నట్లు వెల్లడించారు. టాలీవుడ్‌లో వరుస విజయాలతో సక్సెస్ ఫుల్‌గా ఉన్న శ్రీలీల బాలివుడ్‌లోకి ఎంట్రి ఇస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా తెరకెక్కిస్తున్న మూవీలో శ్రీలీల నటిస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో శ్రీలీలతోపాటు మృణాల్ ఠాకూర్ సైతం నటిస్తోంది. కామెడీ నేపథ్యంలో సాగే ఈ లవ్ స్టోరీని దర్శకుడు డేవిడ్ ధావన్ తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. జూలై చివర్లో షూటింగ్ ప్రారంభమై, అక్టోబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.