Hebah Patel Dhoom Dhaam: చేతన్ కృష్ణ, హెబ్బాపటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ధూంధాం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. సాయికిషోర్ మచ్చా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి హాస్యభరిత చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాను వచ్చే నెల 8వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్విరాజ్, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో ఇందులో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నారు. ఇప్పటికే మూవీకి సంబంధించి ప్రమోషన్ వర్క్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ మూవీ ఇదివరకే రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ అందించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ నిర్మాణ సారథ్యంలో మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.