ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్
Karimnagar Government Hospital: కరీంనగర్, జనవరి 6 (మన బలగం): ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ విభాగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటుచేయాలని రేవంత్ సర్కార్‌ను యుగంధర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ, క్రిటికల్ కేర్ వైద్యం లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి అత్యవసర చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్న రోగులకు వైద్య సౌకర్యం అందడంలేదన్నారు. దీంతో హైదరాబాద్, వరంగల్‌కు వెళ్లి వైద్యం చేయించుకోవాలని వైద్యులు చెప్పడంతో వారు క్రిటికల్ పొజిషన్‌లో వాహనాల్లో వెళుతున్న సందర్భంలో చాలామంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ వందల సంఖ్యలో ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నారని, ఉమ్మడి జిల్లాకు ప్రధాన కేంద్రమైన కరీంనగర్‌లో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ వైద్య సౌకర్యం అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన తగు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తర తెలంగాణకు తల మాణికంలా ఉన్న కరీంనగర్‌లో క్రిటికల్ కేర్ వైద్యం లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని యుగంధర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి చెంచాల మురళి తదితరులు పాల్గొన్నారు.