Comprehensive Family Survey: ఇబ్రహీంపట్నం, నవంబర్ 26 (మన బలగం): సమగ్ర కుటుంబ సర్వే వివరాలు డేటా ఎంట్రీ వేగవతం చేయాలని జగిత్యాల డీఆర్డీఏ పీడీ, ఇబ్రహీంపట్నం మండల ప్రత్యేక అధికారి రఘవరన్ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కంప్యూటర్ అపరేటర్లు చేస్తున్న డేటా ఎంట్రీని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ పలు సూచనలు చేశారు. వేగంగా తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సాంబరి చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.