- స్వామి వివేకానందుడే మనకు ఆదర్శం
- పాత్రికేయులు నిర్మల్ చరిత్రను వెలుగులోకి తేవాలి
Nirmal Press Club: నిర్మల్, జూన్ 6 (మన బలగం): మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. ఉన్నత చదువులను అభ్యసించిన వివేకానందుడు దేశం కోసం సర్వస్వం త్యాగం చేసిన మహనీయుడు.. నరనరానా దేశభక్తిని నింపుకున్న వివేకానందుడే మనకు ఆదర్శమూర్తి అని వివేకానంద సేవా సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ ప్రమోద్ చంద్రా రెడ్డి, ముఖ్యఅతిథి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. నిర్మల్ పాత్రికేయులు వివేకానందుడి స్ఫూర్తితో మన ప్రాంత అభివృద్ధితోపాటు, నిర్మల్ చరిత్రను వెలుగులోకి తెచ్చేందుకు తమ వంతు పాత్రను పోషించాలని వారు కోరారు. జిల్లా కేంద్రంలోని ఉత్సవ్ బంక్వెట్‌హాల్‌లో ఆదివారం స్వామి వివేకానంద సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన నిర్మల్ ప్రెస్‌క్లబ్ నూతన కమిటీని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజాన్ని మార్చగలిగే శక్తి కేవలం పాత్రికేయులకు మాత్రమే ఉందన్నారు. నిర్మల్ జిల్లా సాధనతోపాటు జిల్లా అభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. మరుగున పడిన నిర్మల్ చరిత్రను, ప్రాచీన కట్టడాలను వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. అనంతరం శాలువాలతో నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. ఇందులో సొసైటీ అధ్యక్షుడు కూన రమేశ్, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి ప్రవీణ్, కోశాధికారి నాయిడి మురళి, ఉపాధ్యక్షులు నూకల గురుప్రసాద్, వారల్ మనోజ్, కార్యదర్శులు అబ్ధుల్‌అజీజ్, అంక శంకర్, సభ్యులు డాక్టర్ సుచిన్, డాక్టర్ కత్తి కిరణ్, సీఏ సాయిప్రసాద్, రావుల శ్రీనివాస్, నారాయణ, ఆమెడ రంజిత్, అన్ముల అశ్విన్, శ్రీరామోజీ నరేశ్, నాంపెల్లి శశివర్ధన్, రాజేశ్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.