retired soldier
retired soldier

retired soldier: రిటైర్డ్ జవానుకు బీజేపీ ఆధ్వర్యంలో ఘన సన్మానం

retired soldier: ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 3 (మన బలగం): ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ జవాన్ పంతంగి రవికి భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖా అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ నారాయణపూర్ గ్రామానికి చెందిన పంతంగి రవి కుమార్ దేశ సేవలో 20 సంవత్సరాలు సేవలందించి ఉద్యోగ విరమణ చేయడం అభినందనీయం అన్నారు. ప్రతి యువకుడు తాను సైతం దేశ సేవలో పాల్గొనాలని దీనికి రవిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చందుపట్ల లక్ష్మారెడ్డి, మంతుర్తి శ్రీనివాస్, ఉడుగుల యాదగిరి, బొమ్మాడి స్వామి, వంగల రాజు, నంది నరేష్, దాసరి గణేష్, కృష్ణ హరి, మానుక కుమార్, శ్రీశైలం, కిరణ్ నాయక్, మధు, సాగర్, దేవయ్య పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *