RTC Nirmal: నిర్మల్, జూన్ 27 (మన బలగం): నిర్మల్ నుంచి అరుణాచలం, రామేశ్వరం బస్సు శుక్రవారం బయలుదేరింది. ఈ బస్సు కానిపాకం, అరుణాచలం, పలని, పాతాళ శెంబు, రామేశ్వరం, ధనుష్కోడి వెళ్లి తిరిగి నిర్మల్‌కు జులై 2వ తేదీన వస్తుంది. తీర్థ యాత్రలకు బస్సులు నడుపుతున్నట్లు తెలుపగానే ప్రయాణికులు 2 రోజుల్లోనే టికెట్లు బుక్ చేసుకున్నారని డిపోమేనేజర్ కే. పండరి తెలిపారు. మళ్ళీ అరుణాచలం, రామేశ్వరం బస్సు జులై నెలలో ఉంటుందని తెలిపారు. జులై చివరి వారంలో ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య, భద్రాచలం, అన్నవరం, సమ్మక్క, సారలక్కలకు బస్సు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ తెలిపారు. నిర్మల్ నుంచి ఏ పుణ్యక్షేత్రాలకైనా బస్సులు ఇస్తామని, ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని కోరారు. మీరు ఎక్కడికెళ్లాలన్నా 9959226003,83280 21517 ఫోన్లో సంప్రదించాలని సూచించారు.