Aadhaar Enrollment Camps for Students in Nirmal District: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుతున్న విద్యార్థుల ఆధార్ నమోదు కొరకు, గతంలోని ఆధార్ కార్డులలోని తప్పుల సవరణల కొరకు జిల్లాలో ఈ నెల 13, 14 తేదీల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు నిర్మల్ జిల్లా ఇన్‌చార్జి విద్యాశాఖ అధికారి ముడారపు పరమేశ్వర్ తెలిపారు. జిల్లాలోని 18 మండల కేంద్రాలతోపాటు నిర్మల్, ఖానాపూర్, భైంసా మునిసిపాలిటీల పరిధిలోనూ ఆధార్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల తల్లిదండ్రులు గాని, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గాని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూతనంగా విద్యార్థుల ఆధార్ నమోదు కాని, గతంలో ఆధార్ కార్డు ఉండి ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరణ కానీ చేయించాలని పేర్కొన్నారు.