Rajender Goud elected as Nirmal District Artist Union President: నిర్మల్ జిల్లా ఆర్టిస్ట్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా ఖానాపూర్‌కు చెందిన గుగ్గిళ్ల రాజేందర్ గౌడ్ (రాజ్ ఆర్ట్స్) ఎన్నుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టిస్ట్‌ల ఎన్నికలు నిర్వహించారు. సందర్భంగా రాజేందర్ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు, ఈ బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్క కళాకారుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి ఆర్టిస్ట్‌కు రుణపడి ఉంటానని, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పనులు ప్రతి ఒక్కరికి సమానంగా అందేలా చూడటం తన లక్ష్యం అని, సంఘం అభ్యున్నతి కోసం ఎల్లప్పుడూ కళాకారుల వెంటనే ఉంటానని, కలిసికట్టుగా ముందుకు సాగితే జిల్లా యూనియన్ మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో సహకరించిన సహచర కళాకారులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ ఆర్టిస్టులు పులి శ్రీనివాస్ (శ్రీను ఆర్ట్స్), అమర్ ఆర్ట్స్, సత్య కళా (కడెం), సాయిరాజ్ ఆర్ట్స్, సురి ఆర్ట్స్, గంగాధర్ ఆర్ట్స్, రమేష్ ఆర్ట్స్, దేవి ఆర్ట్స్, రాజేందర్ ఆర్ట్స్, చెర్రీ ఆర్ట్స్, రాము ఆర్ట్స్, రాజ్‌కుమార్ ఆర్ట్స్, సుధా ఆర్ట్స్ తదితరులు పాల్గొన్నారు.