Mahashakti Temple
Mahashakti Temple

Mahashakti Temple: భవానీ శరణు ఘోషతో మార్మోగిన అమ్మవార్ల ఆలయం

  • మహాశక్తి ఆలయంలో ఘనంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
  • 8వ రోజు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మహాదుర్గగా అమ్మవారి దర్శనం
  • అమ్మవారికి పసుపుకొమ్ములతో అలంకరణ
  • భక్తుల తాకిడితో కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం

Mahashakti Temple: మనబలగం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం (ఎనిమిదవ రోజు) అమ్మవారు దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మహాదుర్గగా దర్శనమిచ్చారు. దేవీ దర్శనం కోసం ఉదయం నుంచి సాయంత్రం దాకా భక్తుల ఆలయానికి పోటెత్తారు. భవానీ మాత శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. నవరాత్రి ఉత్సవాలు ముగింపునకు మరో రోజు మాత్రమే మిగిలి ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి తో పాటు కరీంనగర్ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ప్రతిమ పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం సంజయ్ ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. తనని కలవడానికి వచ్చిన పార్టీ శ్రేణులను కలిసి ముచ్చటించారు. అభిమానులతో సెల్ఫీలు దిగారు. ఇక సద్దుల బతుకమ్మ సందర్భంగా మహాశక్తి ఆలయంలో మహిళలు, యువత ఆట పాటలతో సందడి చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బతుకమ్మ పాటలతో అలరించారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలు తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా కనువిందు చేశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *