Police duty meet
Police duty meet

Police duty meet: పోలీస్ డ్యూటీ మీట్‌ను సద్వినియోగం చేసుకోండి

Police duty meet: న్యాయం జరగాలంటే సరైన అధారాలు, నేర దర్యాప్తు చాలా కీలకమైనదని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా డీజీపీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులకు, సిబ్బందికి జిల్లా స్థాయి పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ప్రారంభించారు. ఇందులో భాగంగా కంప్యూటర్, ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్ ప్రింట్స్, హ్యాండ్లింగ్, లిఫ్టింగ్, ప్యాకింగ్ విభాగంలో, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, పోలీస్ జాగిలాల విభాగంలో ట్రాకింగ్, ఎక్స్‌ప్లోజివ్ విభాగాల్లో పోటీలు, ఫొటోగ్రాఫీ, వీడియోగ్రాఫీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం, కేసుల దర్యాప్తులో మెళకువలు నేర్చుకునేందుకు పోలీస్ డ్యూటీ మీట్ దోహదపడుతుందన్నారు.

అదేవిధంగా పోలీసు నైపుణ్యాలను ప్రదర్శించడానికి, ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి చక్కని వేదిక అన్నారు. ఈ డ్యూటీ మీట్‌లో ఉత్తమ ప్రతిభ చూపాలని అన్నారు. జాతీయ స్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్ విజేతలకు మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. ప్రతిభ చూపిన వారికి రాష్ట్రాలు, జాతీయ స్థాయిలో జరిగే పోలీస్ డ్యూటీ మీట్‌కు వివిధ ప్రాంతాల నుంచి పోలీసు అధికారుల మధ్య మరింత సహకారం, ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు. సంక్లిష్టమైన కేసులు పరిష్కరించడానికి దోహదపడుతుందన్నారు. పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొనే వారందరూ అత్యుత్తమ ప్రదర్శనను అందించాలని, రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రవీంద్ర కుమార్, రంగారెడ్డి, ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, రఫీ ఖాన్, లక్ష్మీనారాయణ, రామ నరసింహారెడ్డి, రవి, సురేశ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్ కుమార్, వేణు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *