Savitri Bai Phule Jayanti: తానూరు, జనవరి 3 (మన బలగం): తానూర్ మండల కేంద్రంలోని వాసవి పాఠశాలలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే స్త్రీల అభ్యున్నతి విద్య ద్వారానే సాధ్యమవుతుందని నమ్మి ఆ దిశగా కృషి చేసారని వెల్లడించారు. ఆడపిల్లల కోసం 1848లో పూణేలో బాలకల పాఠశాలను నిర్మించారని తెలిపారు. ఆమె అందించిన సేవలు చిరస్మరణీయం అని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్ నర్సయ్య మరియు ఉపాధ్యాయులు సుధీర్, ప్రియాంక, పూజ, మమత, నవనీత్, నీరజ, అఖిల, కోమల్, రూప, ప్రతిక్ష్యా మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.