Shriram Life Insurance: నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రానికి చెందిన మెట్ల రమేశ్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.29 వేలతో పాలసీ కట్టగా, దురదృష్టవశాత్తు ఇటీవల సహజ మరణం చెందాడు. నామినీ అయినటువంటి ఆయన భార్య మెట్ల మమతకు స్థానిక తహసీల్దార్ లక్ష్మణ్ చేతుల మీదుగా రూ.5,38,250 బీమా చెక్కును అందజేశారు. ప్రతి కుటుంబానికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలని, అదే అండగా ఉంటుందని అన్నారు. కారక్రమంలో శ్రీరామ్ లైఫ్ డీజీఎం అట్ల సురేశ్, డీఎం కే.రవి, బ్రాంచ్ మేనేజర్ పి.వినోద్ కుమార్, నాయకులు గోవింద్, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ స్వప్నల్ రెడ్డి, ఎంప్లాయిస్ బెనిఫిట్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పడగల మల్లేష్, దేవేందర్ లోకిని రాము, గ్రామస్థులు, ఉద్యోగులు, సేల్స్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
*చెక్కును అందజేసిన లైఫ్ ఇన్సూరెన్స్ అధికారులు