Urea shortage in Khanapur farmers suffer: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో రైతులు నానా పాట్లు పడుతున్నారు. బుధవారం పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయానికి ఒక యూరియా లారీ రాగా రైతులు ఎగబడ్డారు. రైతులు క్యూలో నిలబడి ఇబ్బంది పడ్డారు. ఒక లారీ మాత్రమే రావటంతో తమకంటే.. తమకు కావాలని పోటీ పడ్డారు. మండలానికి అవసరం అయ్యే యూరియా సరఫరా కాలేదు. కొద్ది రోజులుగా రైతులు యూరియా కోసం నానా తంటాలు పడుతున్నారు. పంటకు కావాల్సిన యూరియా దొరకక అన్నదాత తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి రాలేదని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరిపడే యూరియా పంపిణీ చేయాలని కోరుతున్నారు.

