medical camp: నిర్మల్, జనవరి 3 (మన బలగం): వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ కాలనీలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ టెస్టులతో పాటు పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ప్రతి ఒక్కరికి అభ కార్డ్ ఎంట్రీ చేశారు. తద్వారా రోగి యొక్క వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, ఆరోగ్యశాఖ సిబ్బంది విమల, అజయ్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.