Training on election duties: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఫిబ్రవరి 12 (మన బలగం): ఆర్ఓలు, ఏఆర్ఓలు ఎలక్షన్ కమిషన్ నియమ, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని మాస్టర్ ట్రైనర్లు సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల నిర్వహణపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో బుధవారం రిటర్నింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మాస్టర్ ట్రైనర్లు మాట్లాడుతూ, ఎన్నికల విధులను ఎంతో జాగరూకతతో నిర్వర్తించాలని, నియమ, నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ద్వారా అందించిన హ్యాండ్ బుక్ (కర దీపిక)ను చదువుకుని ఈసీ మార్గదర్శకాల మేరకు సజావుగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలు ఉన్నా, అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ, స్ర్కూటీని, పార్టీ గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ విధానం, ఓట్ల లెక్కింపు మోడల్ కండక్ట్ తదితర అంశాలపై పది మంది మాస్టర్ ట్రైనర్లు వివరించారు. ఎలాంటి ఆక్షేపణలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. ఈ శిక్షణ తరగతుల్లో జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, మాస్టర్ ట్రైనర్లు, ఆర్ఓలు, సహాయ ఆర్ఓలు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.
