District Level Science Fair: వైజ్ఞానిక ప్రదర్శనతో విద్యార్థుల నైపుణ్య సామర్థ్యాలు పెరుగుతాయని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తెలిపారు. మంగళవారం స్థానిక సోఫీనగర్‌లోని గురుకుల పాఠశాల, కళాశాలలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులంతా నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని తెలిపారు. వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ఆవిష్కరణలను ప్రదర్శించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులంతా చదువుతోపాటు అన్ని రంగాల్లో నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జీవితంలో సైన్స్‌కు గల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. భవిష్యత్తులో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డానియల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.