Ethanol industry issue: ఇథనాల్ పరిశ్రమతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిలావర్‌పూర్ మండల రైతులు, వివిధ గ్రామస్తులు, ఇథనాల్ పరిశ్రమ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల అభిప్రాయాలు, అనుమానాలు, ప్రశ్నలకు అధికారులు, పరిశ్రమ ప్రతినిధుల నుంచి సమాధానాలు, వివరణలు అడిగి తెలుసుకున్నారు. రైతుల ప్రశ్నలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో దిలావర్‌పూర్ మండలంలోని వివిధ గ్రామస్తులు, రైతులు, వివిధ శాఖల అధికారులు, ఇథనాల్ పరిశ్రమ ప్రతినిధులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.