అభినందించిన మండల విద్యాధికారి శ్రీనివాస్
Gold medals for students: మనబలగం, వీర్నపల్లి: సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించిన రంగోత్సవ్ కార్యక్రమంలో వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండా పాఠశాల చిన్నారులు బంగారు పతకాలు సాధించారు. తొమ్మిది మంది విద్యార్థినీ విద్యార్థులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనితను, చిన్నారులను మండల విద్యాధికారి శ్రీనివాస్ అభినందించారు. అలాగే బాబాయ్ చెరువు తండా పాఠశాల విద్యార్థులు అయిదుగురు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. రంగోత్సవ్ కార్యక్రమంలో రెండు పాఠశాలల చిన్నారులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించడం పట్ల వీర్నపల్లి మండలంలోని ఇతర పాఠశాలల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అభినందించారు.