Kotilingala: వెల్గటూర్, నవంబర్ 15 (మన బలగం): కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మండల నాయకులతో కలిసి కోటిలింగాల వద్ద గల బోటింగ్ చేశారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.