Krishnashtami Celebrations Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో శ్రీ కృష్టాష్టామి వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జారుడు గుంజకు ప్రత్యేక పూజలు చేశారు. హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉట్టి కొట్టెందుకు 9 టీములు పాల్గొన్నాయి. పట్టణంలోని పలువురు యువకులు ఆసక్తిగా పాల్గొని ఉట్టి కొట్టారు. ఇందులో మొదటి బహుమతి పద్మావతి నగర్, రెండో బహుమతి శాంతినగర్, మూడో బహుమతి చైతన్య యూత్ యువకులు పొందారు. వీరికి సేవా భారతి సొసైటీ వారు బహుమతులు అందించారు. కార్యక్రమం తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆద్యంతం ఎంతో ఆసక్తిగా కొనసాగింది. కార్యక్రమంలో సీఐ అజయ్, ఎస్ఐ రాహుల్, హిందూ ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షులు రాచమల్ల రాజశేఖర్, సభ్యులు శెట్టి శ్యాం మోహన్, కరిపె శ్రీనివాస్, అల్లాడి వెంకటేశ్వర్లు, చింతామణి శ్రీనివాస్ కృష్ణ, అడ్డగట్ల రాజన్న, ప్రధాన ఆచార్యులు చక్రపాణి నర్సింహమూర్తి, తోట సత్యం, తదితరులు పాల్గొన్నారు.
