Soan Godavari: నిర్మల్, నవంబర్15 (మన బలగం): నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని గోదావరి నది భక్తజన సంద్రాన్ని తలపించింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించారు. సైకత లింగాలను ప్రతిష్ఠించి హారతులు ఇచ్చారు. వత్తులను కాల్చి మొక్కులు తీర్చుకున్నారు. గోదావరిలో పిండి దీపాలు వదిలి చల్లంగ సూడు గంగమ్మ అని వేడుకున్నారు. అనంతరం నది సమీంపలోని అతి పురాతన వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో కొలువైన శివకేశవులకు హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు వద్ద పండి దీపాలు వెలగించారు. కార్తీక పౌర్ణమిని పురస్కించుకొని ఆలయంలో సత్యనారాయణ వ్రతాన్ని శివప్రసాద్ పంతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
