Deer injured
Deer injured

Deer injured: కుక్కల దాడిలో దుప్పికి గాయాలు

Deer injured: నిర్మల్, మార్చి 20 (మన బలగం): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని కొమురంభీమ్ చౌరస్తా వద్ద డబుల్ బెడ్ రూమ్స్ కాలనీలో గురువారం ఉదయం కుక్కలు దాడి చేయడంతో చుక్కల దుప్పికి గాయాలయ్యాయి. సమీపంలోని అడవి నుంచి వచ్చిన చుక్కల దుప్పిని దూసి కుక్కలు వెంటపడి గాయపరిచాయి. స్థానికులు గమనించి కుక్కలను తరిమివేసారు. తీవ్రంగా గాయపడిన దుప్పిని స్థానికులు రక్షించారు. వెంటనే ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్టు అధికారులు అక్కడికి చేరుకొని దుప్పిని వాహనంలో చికిత్స నిమిత్సం తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *