Police cycle rally: మెట్‌పల్లి (ఇబ్రహీంపట్నం), అక్టోబర్ 26 (మన బలగం): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని నిఖిల్ భారత్ స్కూల్ నుంచి 100 మంది విద్యార్థులతో కలిసి పోలీసులు సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ, అరోగ్యం కోసం సైకిల్ వినియెగంపై పలు సూచనలు చేశారు. పట్టణంలో ర్యాలీ పాత బస్టాండ్ మీదుగా బస్ డిపో వరకు కొనసాగింది. కార్యక్రమంలో మెట్‌పల్లి సీఐ నిరంజన్ రెడ్డి, పట్టణ ఎస్ఐ 2 రాజు, పోలీసు సిబ్బంది, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.