- పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
- ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయాలి
- నూతన భవన నిర్మాణాల అనుమతులు నిబంధనల ప్రకారం జారీ చేయాలి
- సిబ్బంది అనుమతి లేకుండా సెలవులు మంజూరు చేయవద్దు
- ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
- సిరిసిల్ల మున్సిపాల్టీల పని తీరుపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
Collector Sandeep Kumar Jha: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, జనవరి 30 (మన బలగం): మున్సిపాలిటీలలో ప్రతి ఒక్క అధికారి తన విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సిరిసిల్ల మున్సిపాల్టీల పని తీరుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. మున్సిపాలిటీలలో పని చేస్తున్న సిబ్బంది, అధికారుల వివరాలు, వారు నిర్వహిస్తున్న విధులు, శానిటరీ డోర్ కలెక్షన్, ఎన్ని చెత్త బుట్టలు పంపిణీ చేసారు, వాహనాలు వివరాలు, వర్కింగ్ నాన్ వర్కింగ్, ట్రెడ్ లైసెన్సులు, వాటి ఆదాయ వివరాలు బిల్డింగ్ పర్మిషన్స్, వీఎల్‌టీ, ఆస్తి పన్ను వసూళ్లు, స్లీపింగ్ యంత్రాలు, వాటర్ ట్యాంక్, డోజేర్స్, బ్లేడ్స్, వర్మి కాంపొస్ట్, ఎస్‌టీపీ ప్లాంట్ పని తీరు, తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, మున్సిపాలిటీ సిబ్బందికి అనుమతి లేనిదే సెలవులు మంజూరు చేయరాదని అన్నారు. సిరిసిల్ల పట్టణాలలో పారిశుధ్య నిర్వహణ మరింత మెరుగ్గా అమలు చేయాలని, ప్రతి రోజూ ఉదయం పారిశుధ్య సిబ్బంది హాజరు అటెండెన్స్ పక్కాగా నమోదు జరగాలని, ప్రతి రోజూ చెత్త సేకరణ పకడ్బందీగా చేయాలని అన్నారు. మున్సిపల్ వాహనాలకు ప్రభుత్వ పెట్రోల్ బంక్‌లో మాత్రమే డీజిల్ వాడాలని కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ వాహనాలకు జీపీఎస్ ట్రాకర్ ఏర్పాటు చేయాలని, ప్రతి రోజూ ఆ వాహనాల మూమెంట్‌ను మానిటరింగ్ చేయాలని అన్నారు.
మున్సిపాలిటీలలో జారీ చేసిన ట్రెడ్ లైసెన్స్, వాటి రెన్యువల్స్, వసూలు చేస్తున్న లైసెన్స్ ఫీజు పునఃపరిశీలించాలని, పూర్తి స్థాయిలో ప్రతి వ్యాపారి నుంచి ట్రెడ్ లైసెన్స్ ఫీజులు వసూలు చేయాలని, కలెక్టర్ ఆదేశించారు. పట్టణాలలో నిర్దేశిత లక్ష్యం మేరకు 100 శాతం ఆస్తి పన్ను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని అన్నారు. నూతన భవన నిర్మాణాల అనుమతులు, నూతన లేఔట్ అనుమతులు నిబంధనల ప్రకారం జారీ చేయాలని అన్నారు. నూతన లేఔట్‌లలో ఓపెన్ ప్లెస్, ఇతర నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అన్నారు. పట్టణాలలో మొక్కల పెంపకం, తాగు నీటి సరఫరా సంబంధిత వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. సిరిసిల్ల బైపాస్ రోడ్డు వద్ద బ్లేడ్ యంత్రాలతో మిడియన్, రోడ్డు పక్కన ఉండే పిచ్చి మొక్కల తొలగిస్తూ శుభ్రం చేయాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలలో టి.యూ.ఎఫ్.ఐ.డి.సి ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితి గతులు తెలుసుకున్న కలెక్టర్ ప్రాధాన్యత క్రమంలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని అధికారులను ఆదేశించారు. పట్టణాలలో అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలు తీసుకోవాలని, అనుమతి లేని నిర్మాణాలకు ఆస్కారం ఇవ్వవద్దని, వాటర్ బాడిస్ ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో సిరిసిల్ల మునిసిపల్ కమీషనర్ లావణ్య, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.