winners of the poetry competition: హైదరాబాద్, జనవరి 29 (మన బలగం): కణిక సాహిత్యం సామాజిక సేవ విద్యారంగ వేదిక, వ్యవస్థాపక అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి రమదేవి కులకర్ణి ఆధ్వర్యంలో ప్రతి వారం కవితల పోటీ నిర్వహిస్తున్నారు. సాయి స్రవంతి జాదవ్, దేవులపల్లి రమేశ్ నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈవారం మగువా..ఓ మగువా!! కార్యక్రమంలో ‘భ్రూణ హత్యలు ఆపుదాం – ఆడపిల్లలను ఎదగనిద్దాం’ అనే అంశంపై నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ స్థానంలో ఎం.వీర కుమారి, ద్వితీయ స్థానంలో విజయ కుమారి, తృతీయ స్థానంలో డి.లక్ష్మి పద్మజ ఈ వారం విజేతలుగా నిలిచారు. రమాదేవి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్యం, తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. తమ సంస్థ నుంచి, సాహిత్యపరంగా, విద్యాపరంగా విద్యార్థులకు మోటివేషన్ క్లాసుల ద్వారా సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కవులు, కళాకారులు తదితరులు పాల్గొన్నారు.