Couple injured
Couple injured

Couple injured: గుర్తుతెలియని వాహనం ఢీకొని దంపతులకు గాయాలు

Couple injured: నిర్మల్, జనవరి 30 (మన బలగం): నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్‌పట్ల గ్రామానికి చెందిన సాయన్న, పోసవ్వ అనే వృద్ధులు గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు. బాల్కొండ మండలం దూదిగాం గ్రామానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఐబీ సమీపంలో వీరు వెళుతున్న ఎక్సెల్ వాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన వృద్ధులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *