వీరంతా బంధువులే
KumbhMela: నిర్మల్, జనవరి 31 (మన బలగం): కుంభమేళాకు వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు మహిళలు తప్పిపోయారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. కోట్లాదిమంది భక్తులు తరలివచ్చి పవిత్రస్నానాలు ఆచరిస్తున్నారు. కాగా గత మంగళవారం అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో 30 మంది దర్మరణం చెందారు. వందమందికిపైగా గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు ముందే జగిత్యాలకు చెందిన ఇద్దరు, నిర్మల్ జిల్లా కడెంకు చెందిన ఇద్దరు మహిళలు కుంభమేళాకు చేరుకున్నారు. జిగిత్యాలలోని విద్యానగర్‌కు చెందిన నర్సవ్వ (55), కొత్తవాడకు చెందిన రాజవ్వ (55), కడెంకు చెందిన బుచ్చవ్వ (65) అక్కా చెల్లెళ్లు. కడెంకు చెందిన సత్తవ్వ (55) బుచ్చవ్వుకు వియ్యపురాలు అవుతుంది. వీరితోపాటు మరో ఏడుగురు మహిళలు మొత్తం 11 మంది కలిసి ఈ నెల 20వ తేదీన కుంభమేళాకు వెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి ఈ నలుగురు మహిళలు కుటుంబ సభ్యులకు ఫోన్‌లో టచ్‌లో లేరు. మిగతా మహిళలు క్షేమంగా ఉన్నారు. వీరి నుంచి విడిపోయిన నలుగురు మహిళలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారో తెలియరావడంలేదు. వీరి ఆచూకీ కోసం కడెం, జగిత్యాల నుంచి కుటుంబ సభ్యులు కుంభమేళా బయలుదేరి వెళ్లారు.