Inauguration of Shri Sathya Sai Seva Mandir: ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 22 (మన బలగం): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో భగవాన్ శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన సేవా మందిరాన్ని ఆదివారం రాష్ట్ర అధ్యక్షులు పి.వెంకటరావు ప్రారంభించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వెంకట రావు, జిల్లా అధ్యక్షులు ర్యాగళ్ల విలేశ్వర్, సమితి కన్వీనర్ గూడ రమేశ్, సభ్యులు గంట శ్రీనివాస్, దొంతుల హరీష్, గణేశ్, సత్యనారాయణ, ప్రసాద్, రత్నాకర్, వెంకటరమణ, గంగాధర్ మహిళలు భక్తులు తదితరులు పాల్గొన్నారు.