India vs Pakistan Asia Cup Final Prayers in Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పద్మావతి నగర్‌కు చెందిన యువకులు ఆదివారం ఇండియా మ్యాచ్ విజయం సాధించాలని ప్రత్యేక పూజలు చేశారు. హనుమాన్ మందిర్ ప్రతిష్టించిన దుర్గాదేవి మంటపం వద్ద పద్మావతి నగర్ యూత్ సభ్యులు, దుర్గామాత మాల ధారణ చేసిన స్వాములు కలిసి ఆదివారం జరుగనున్న పాకిస్తాన్ ఇండియా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ గెలవాలని దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసిన మొక్కు కున్నారు. పాకిస్తాన్ మారణకాండ చేసినందుకు వారికి గట్టి బుద్ది చెప్పాలని అన్నారు. కార్యక్రమంలో పద్మావతి నగర్ యూత్ ప్రెసిడెంట్ నడిమట్ల సురేష్, అట్లగట్ల రాజన్న, రాపల్లి రాజు యాదవ్, రామ్ భీమయ్య, ఆడెపు రవి తదితర స్వాములు పాల్గొన్నారు.