Inspection of works of 2 BHK houses: జగిత్యాల, అక్టోబర్ 26 (మన బలగం): నూకపల్లిలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాల పనుల్లో వేగం పెంచాలని జగిత్యాల కలెక్టర్ బి.సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నూకపల్లిలో రూ.32.36 కోట్లతో కొనసాగుతున్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డ్రైనేజి, సెప్టిక్ ట్యాంకుల నిర్మాణం, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, రోడ్డు పనులను పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నాణ్యతతో కూడిన పనులు చేయాలని, క్యూరింగ్ చేయాలని సూచించారు. అధిక సంఖ్యలో లేబర్‌ను నియమించుకొని డిసెంబర్ నెల వరకు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, పీఆర్ ఈఈ రెహమాన్, అశోక్ రెడ్డి హౌజింగ్, డీఈ రాజేశ్వర్, సంబంధిత అధికారులు, తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.