Awareness of Iodine Deficiencies
Awareness of Iodine Deficiencies

Awareness of Iodine Deficiencies: అయోడిన్ లోపాలపై అవగాహన పెంచుకోండి

Awareness of Iodine Deficiencies: జగిత్యాల ప్రతినిధి, జనవరి 3 (మన బలగం): మనం తీసుకొనే ఆహారంలో సమతుల్యత కోల్పోయి అయోడిన్ లోపం ఏర్పడుతుందని, దీనిపై ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన పెంచుకోవాలని జగిత్యాల మండల విద్యాధికారి భూమయ్య అన్నారు. ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఐటీసీ సహకారంతో స్మార్ట్ ఆశీర్వాద్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఓల్డ్ హైస్కూల్ విద్యార్థులకు అయోడిన్ లోపాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈవో భూమయ్య మాట్లాడుతూ మనం తీసుకునే ఆహారంలో సరిపడా అయోడిన్ లేని ఉప్పు కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. అయోడిన్ లేని ఉప్పు తీసుకోవడంతో గొంతు సంబంధిత, బుద్ది మాంధ్యం, శారీరక ఎదుగుదల సమస్యలు వంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయని అన్నారు. ప్రతి విద్యార్థి అయోడిన్ లోపలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులకు అవగాహన కోసం చిన్న తెరపై స్లయిడ్స్‌ను ప్రదర్శించారు. విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ప్రోగ్రాం మేనేజర్ గుంటి రవికుమార్, రిసోర్స్‌పర్సన్ వంశీ కృష్ణ, టీమ్ సభ్యులు రచన, సంధ్య, తిరుపతి, సంజన, పాఠశాల హెచ్‌ఎం చంద్రకళ, టీచర్లు బోయినిపెల్లి ఆనందరావు, సూర్య ప్రకాశ్, విద్యాదేవి, మల్లికార్జున్, సంజీవయ్య, అరుణ, హరిత, సావిత్రి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

Awareness of Iodine Deficiencies
Awareness of Iodine Deficiencies

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *