HIV awareness: సోన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం హెచ్ఐవీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విజయ్ కుమార్, జిల్లా ఎడిషన్ నియంత్రణ సంస్థ జిల్లా పర్యవేక్షకుడు అనిల్ కుమార్ సూచించారు. హెచ్ఐవీ వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ వైష్ణవి, స్టాఫ్ నర్స్ సునీత, డీఎస్‌ఆర్‌సీ కౌన్సిలర్ శ్రీనివాస్, ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మారెడ్డి ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఎఫ్ఐసీటీసీలో హెచ్ఐవీ పరీక్షలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి పరీక్షలు పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా హెచ్ఐవీ నివారణ పద్ధతులపై అవగాహన కల్పించే గోడప్రతులను ఆవిష్కరించారు.
