ఉత్సాహంగా సాగిన టూకే రన్
World Cancer Day: జగిత్యాల ప్రతినిధి, ఫిబ్రవరి 4 (మన బలగం): ప్రపంచ మానవాళికి ముప్పుగా పరిణమించిన క్యాన్సర్ వ్యాధికి మన దేశంలో టీకాతోనే రక్షణ ఉందని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐఎమ్ఏ, జగిత్యాల అబ్‌స్ట్రెక్టివ్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మినీస్టేడియం టూ ఐఎమ్ఏ భవనం వరకు నిర్వహించిన 2కే రన్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ముప్పుగా మారిన క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు. మన దేశం క్యాన్సర్ సంబంధిత మరణాలలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉండన్నారు. క్యాన్సర్ నివారణకు టీకాయే శరణ్యమని అన్నారు. 9 ఏండ్ల నుంచి 14 ఏండ్ల మధ్యలోని ఆడపిల్లలకు రెండు విడతల్లో క్యాన్సర్ నివారణ టీకాను ఇస్తారని అలాగే 26 ఏండ్ల వరకు ఈ టీకాను తీసుకొంటే క్యాన్సర్ నుంచి రక్షణ ఉంటుందన్నారు. హెచ్.పి.వి వ్యాక్సిన్‌పై అవగాహన కోసమే ఈ కార్యక్రమాన్ని చెపట్టినట్లు ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ హేమంత్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, ప్రసూతి, స్త్రీ జననేంద్రియ సంఘం ప్రెసిడెంట్ డాక్టర్ జి శ్రీలత, డాక్టర్ వి రజిత, సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం మోహన్ రెడ్డి , డాక్టర్లు పద్మనీ, విజయకుమార్, శంకర్, సతీష్ కుమార్, శశికాంత్ రెడ్డి, రామకృష్ణ, సుమన్ రావు, ఎన్. శ్రీనివాస్, ఏ. శ్రీనివాస్ , శ్రవణ్, సిహెచ్. రమేష్, కె.ప్రవీణ్, జి.సంతోష్, రాజేష్, కె. సుధీర్ కుమార్లతోపాటు నర్సింగ్, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
