road accident: తెలంగాణ బ్యూరో/ మన బలగం: జగిత్యాల జిల్లా చిన్నకోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం(road accident)లో మహిళా ఎస్సై (Lady SI) మృతిచెందారు. వెల్గటూర్ ఎస్సైగా పనిచేసిన కొక్కుల శ్వేత జగిత్యాల డీసీఆర్‌బీలో ఎస్సైగా కొనసాగుతున్నారు. శ్వేత గొల్లపల్లి వైపు నుంచి జగిత్యాలకు కారులో వస్తున్నారు. చిల్వకోడూరు వద్ద ఎదురుగా వస్తున్న బైకును బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఎస్సై కారులోనే స్పాట్ డెడ్ అయ్యారు. బైకుపై ఉన్న యువకుడు సైతం మృతిచెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా దవాఖానకు తరలించారు.