tribute to Manda Jagannatham: ధర్మపురి, జనవరి 13 (మన బలగం): మాజీ ఎంపీ మంద జగన్నాథం అకాల మృతి దళిత జాతికి తీరని లోటు అని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కట్ట లక్ష్మణ్ మాదిగ అన్నారు. ధర్మపురి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంద జగన్నాథం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు చిలుముల లక్ష్మణ్ మాట్లాడుతూ మంద జగన్నాథం ఎస్సీ వర్గీకరణ కోసం ఎంతో కృషి చేసారని కొనియాడారు. కార్యక్రమంలో దళిత సంఘాల రాష్ట్ర నాయకులు పారపెల్లి రాజ మల్లయ్య మాదిగ, ఎమ్మె్స్పీ జిల్లా ప్రధాన కార్యదర్శి అరికిళ్ల సతీశ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొకెనపెల్లి సతీశ్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బరిగెల ప్రశాంత్, సీనియర్ నాయకులు రాయిల్లా రవి కుమార్, దీకొండ మహేందర్ మాదిగ, శ్రీరాం అంజయ్య మాదిగ, గజ్జెల రాజేశ్ మాదిగ, మండల గౌరవ అధ్యక్షులు బొల్లారపు పోచయ్య మాదిగ, మాజీ అధ్యక్షులు చందోలి శ్రీనివాస్, జిల్లపెల్లి గంగారాం మాదిగ, న్యాయవాది గజ్జెల రాజు మాదిగ, బొల్లారపు పెద్ద గంగారాం, తాటిపెల్లి మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.