Rangoli Competition: మల్యాల, జనవరి 13 (మన బలగం): ముత్యంపేట గ్రామంలో భోగి సందర్భంగా నేతాజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలో 26 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేసారు. బద్దం తిరుపతి రెడ్డి సహకారంతో ముగ్గుల పోటీ నిర్వహించారు. మొదటి బహుమతి ఉదరపు శ్యామల, రెండో బహుమతి చెట్‌పెల్లి సృజన, మూడో బహుమతి నీలం అనూష అందుకున్నారు. కార్యక్రమంలో నేతాజీ యూత్ క్లబ్ అధ్యక్షుడు గంగాధర హరీశ్, కార్యదర్శి పొనగంటి సిద్ధార్థ, కోశాధికారి భాను ప్రసాద్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.