The boy died: నిర్మల్, జనవరి 15 (మన బలగం): నిర్మల్ జిల్లా కేంద్రంలో బుధవారం పండుగ పూట విషాదం నెలకొంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలో హుజీబ్ (14) బాలుడు గాలిపటం ఎగురవేస్తూ డాబాపై నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాలైన బాలుడిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాలుడిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.