Public Welfare – Development Programs in Khanapur: సంక్షేమ పథకాల్లో ముదుండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తోందని ఎంపీ గోడం నాగేశ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ఆదివారం పలు గ్రామాల్లో వివిధ పనులు ప్రారంభించారు. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్‌లో పీఎంశ్రీ నిధులు రూ.13. 50 లక్షల వ్యయంతో నిర్మాణం చేసిన సైన్స్ ల్యాబ్‌ను ప్రారంభించారు. కడెం మండలం సారంగాపూర్‌లో రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఖానాపూర్ మండలంలోని రాజురలో ఎన్‌హెచ్ఎం నిధులు రూ.16 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని ప్రారంభించారు. మండలంలోని బాదనకూర్తిలో రూ.12 లక్షలతో అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేశారు.
కడెం మండలం సారంగాపూర్‌లో కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్లను, డ్రైనేజీలను పరిశీలించి నాణ్యతగా పనులు చేయాలని సూచించారు. వేరు వేరుగా జరిగిన కార్యక్రమాల్లో మాట్లాడుతూ, మహిళలు ముందుకు వెళ్లే విధంగా వివిధ పథకాలు చేపట్టామని, యూరియా విషయంలో రైతులు ఇబ్బంది పడకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మజీద్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజుర సత్యం, ఆత్మ చైర్మన్ తోట సత్యం, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, నాయకులు జంగిలి శంకర్, నిమ్మల రమేశ్, నిమ్యానాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.