MLA Bojju Patel Assures Support to Lightning Victims’ Family: ర్మల్ జిల్లా పెంబి మండలంలోని గుమ్మెన ఎంగ్లాపూర్‌లో మొన్నటి వర్షాలకు పిడుగు పడి దుర్మరణం చెందిన భార్య, భర్తలు ఎల్లయ్య – లక్ష్మి దంపతుల కుటుంబాన్ని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉండి, అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. సంఘటన గురించి ఎస్ఐని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రకృతి విపత్తు మరణించిన వ్యక్తికి రూ.6 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే పిల్లలను చదించే విధంగా ఇద్దరు పిల్లలకు గురుకులంలో సీటు ఇప్పించి చదివిస్తామని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని చెప్పారు. ధైర్యంగా ఉండాలని, ఎలాంటి సహకారం అయినా అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నాగపూర్‌లో వారి ఇంటికి వెళ్లి పది వేల ఆర్థిక సహాయం అందించారు. గుమ్మనా ఎంగ్లాపూర్ బాధితుని కుటుంబానికి ఐదు వేల ఆర్థిక సహాయం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.