Distribution of CMRF Cheques
Distribution of CMRF Cheques

Distribution of CMRF Cheques: పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి.. డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు

Distribution of CMRF Cheques: నిర్మల్, అక్టోబర్ 24 (మన బలగం): ముఖ్యమంత్రి సహాయనిధి, నిరుపేదలకు వరం లాంటిదని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు అన్నారు. జిల్లా కేంద్రం భాగ్యనగర్‌లోని శ్రీహరి రావు క్యాంపు కార్యాలయంలో నిర్మల్ పట్టణం, సారంగపూర్, లక్ష్మణచందా, సోన్, మామడ, మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు గురువారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిర్మల్ ఏఎంసీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాందేడాపు చిన్నూ, లక్ష్మంచాంద జడ్పీటీసీ ఓసా రాజేశ్వర్, మామడ మండల జెడ్పీటీసీ రాథోడ్ సంతోష్ సోనియా, మాజీ ఏఎంసీ డైరెక్టర్ లింగారెడ్డి, సోన్ మండల అధ్యక్షులు మధుకర్ రెడ్డి, దేవరకోట చైర్మన్ కొండ శ్రీనివాస్, వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ.. వివిధ అనారోగ్య సమస్యలతో చికిత్స పొంది ఆర్థిక భారం భరించలేక ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులతో 15 మంది లబ్ధిదారులకు ఐదు లక్షల 70 వెయ్యిల రూపాయల సహాయం మంజూరైందని తెలిపారు. సరైన ఆరోగ్య అవసరాల కోసం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *