Bandi Sanjay: మనబలగం, కరీంనగర్ బ్యూరో: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యులు కేంద్ర మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్‌ను కరీంనగర్‌లోని రేకుర్తి హనుమాన్ ఆలయ పరిసరాల్లో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. బండి సంజయ్ సభ్యులందరిని అభినందించి శుభాకాంక్షలు తెలియచేసారు. ఉద్యోగులకు అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు సమర సేన, సెక్రెటరీ జబీ, జాయింట్ సెక్రటరీలు శ్రీకాంత్, చంద్రకళ, పబ్లిసిటీ సెక్రటరీ కిరణ్, కార్యవర్గ సభ్యులు శేఖర్, భాగ్యలక్ష్మి , శ్రావ్య పాల్గొన్నారు.