Alumni Association
Alumni Association

Alumni Association: వేములవాడలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Alumni Association: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపించాలని, పాఠశాల రిటైర్డ్ హిందీ టీచర్ వాసాలమర్రి విట్టల్ సూచించారు. ఆదివారం వేములవాడ భీమేశ్వర వీధిలోని బాలాంబిక సాధనములో జరిగిన 1974 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత 70 సంవత్సరాల నుంచి ఇక్కడ హైస్కూల్ దాదాపు 50 గ్రామాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు విద్యా బోధన అవకాశం కల్పించిందని అన్నారు. ప్రస్తుతం ఉన్న హైస్కూల్లో క్రీడాస్థలం వసతి స్థలం సరిగాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1980 ప్రాంతాల్లో హైస్కూల్ స్థలాన్ని సగం వరకు విడదీసి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇచ్చారని, దీనివల్ల పాఠశాలకు అసౌకర్యాలు ఏర్పడ్డాయని అన్నారు. జూనియర్ కళాశాలకు కమాన్ రోడ్ లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారని సంబంధించిన ప్రభుత్వ నిధులు బ్యాంకులో డిపాజిట్ గా ఉన్నాయని వివరించారు. జూనియర్ కళాశాలను అక్కడికి మార్చి ఈ స్థలాన్ని హైస్కూల్ కు అప్పగించాలని కోరారు. ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి 50 మంది వరకు హాజరయ్యారు.

అప్పటి గురువులు రిటైర్డ్ టీచర్లు వాసాల మర్రి విట్టల్, రిటైర్డ్ ఎంఈఓ దేవేంద్రం, రిటైర్డ్ హిందీ పండిట్ కామారపు సాంబశివరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 1974 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఈ ముగ్గురు టీచర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. 50 ఏళ్ల గ్యాప్ అనంతరము ఈ విద్యార్థులు హైస్కూల్ ప్రాంగణానికి వెళ్లి ఫోటోలు దిగారు. పూర్వ విద్యార్థుల పక్షాన ఉపాధ్యాయుల సాంబశివుడు, డాక్టర్ పోలాస రమేష్, డాక్టర్ కేశన్నగారి అశోక్ -డాక్టర్ శ్రీదేవి, పెద్దిశోభ, ధనలక్ష్మి, రాగంపేట సామ్రాజ్యం, డాక్టర్ శ్రీనివాస్, వేదాంతం ఉదయశ్రీ, వేములవాడ సింగిల్ విండో వైస్ చైర్మన్ తూమ్ లక్ష్మికాంతారావు, బుట్టా శంకర్, చింతలపల్లి రాజిరెడ్డి, రిటైడ్ పౌర సంబంధాల అధికారి బైరి పూర్ణచందర్, శైలజ, ఎల్ఐసి ఏజెంట్ లక్ష్మీ, నాంపల్లి సింగిల్ విండో చైర్మన్ బి. సల్మాన్ రెడ్డి, రిటైర్డ్ ఎస్.ఐ. మాదాసు మల్లేశం, సయ్యద్ సాబీర్, తుమ్మ బాల శౌరిరెడ్డి, ప్రముఖ వర్తకులు తమ్మిశెట్టి అశోక్, పుల్లూరు విశ్వనాథం, ఎల్లాల లక్ష్మారెడ్డి దంపతులు, కౌసల్య, కమలగారి శ్రీనివాస్, బివి శర్మ, రామతీర్థపు లక్ష్మీరాజ్యం, హిస్టోరియన్ సంకేపల్లి నాగేంద్రశర్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *