- రెండుసార్లు ఎత్తిన టవర్ బ్రిడ్జి
- తెలుగోల్ల వీక్షణకు ఏర్పాటు
- థామస్ రివర్‌లో అరుదైన ప్రదర్శన
London Bridge: జగిత్యాల ప్రతినిధి, జనవరి 19 (మన బలగం): లండన్ థామస్ రివర్ గుండా సముద్రంలో షిప్‌ల రాక పోకలకు రెండుగా విడిపోయే లండన్ టవర్ బ్రిడ్జిపై తెలుగోళ్లు కనుల విందైన ప్రదర్శన ఆదివారం చేపట్టారు. తెలంగాణ ముద్దు బిడ్డలైన జగిత్యాల వాసులు అందె వంశీకృష్ణ, సింధు లండన్‌లోని తెలుగువారి వినోదాలకు ఈస్ట్ లండన్ ఎంటర్‌టైన్మెంట్ అనే సంస్థను స్థాపించి తెలుగు వారి సంస్కృతిక వారసత్వ పండుగలతోపాటు అనేక ఈవెంట్లను నిర్వహిస్తూ తెలుగువారు ఎక్కడైనా తక్కువేమి కాదని ప్రపంచానికి చాటుతూ తెలుగోళ్ల సమైక్యతను నిలుపుతూ వస్తున్నారు. ఇలా లండన్‌లో ఉన్న 650 మంది తెలుగువారిలో సంక్రాంతి సంబురాల్లో ఆనందాన్ని పెంచాలని తలిచారు. కేవలం పెద్ద పెద్ద షిప్‌లు వెళ్లే సమయాల్లో ఎత్తే లండన్ టవర్ బ్రిడ్జ్‌ను ఎత్తేందుకు అక్కడి ప్రభుత్వంతో అనుమతి పొంది రెండు సార్లు బ్రిడ్జిని ఎత్తారు. బోట్లలో వెళ్లిన 650 మంది తెలుగువారు కింద నుంచి ఆ దృశ్యాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. కేవలం నౌకల రాకపోకల సమయాల్లోనే ఎత్తే ఈ బ్రిడ్జిని వినోదాన్ని పంచిన ఈస్ట్ లండన్ ఎంటర్‌టైన్మెంట్ అనే సంస్థ నిర్వాహకులు వంశీ, సింధులు తెలుగువారికి గర్వకారణమని పలువురు కొనియాడుతున్నారు.