MLA Vedma Bojju Patel Guides Congress Workers on Public Welfare Schemes in Khanapur
MLA Vedma Bojju Patel Guides Congress Workers on Public Welfare Schemes in Khanapur

MLA Vedma Bojju Patel Guides Congress Workers on Public Welfare Schemes in Khanapur: పార్టీ శ్రేణులనులు ప్రజలకు అందుబాటులో ఉండాలి

  • ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలి
  • కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

MLA Vedma Bojju Patel Guides Congress Workers on Public Welfare Schemes in Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం, ఖానాపూర్ మండలాల కార్యకర్తలతో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం అమలు చేసిన పథకాలనే ప్రజల్లోకి తీసుకవేళ్ళాలని, ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కాకముందే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందించటం జరిగిందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా మహిళలకి ఫ్రీ బస్సు, రైతులకు రెండు లక్షల రుణమాఫీ,సన్న బియ్యం పంపిణి, 10 లక్షల ఆరోగ్య శ్రీ, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఉచిత కరెంట్, గ్యాస్ సబ్సిడీ, రైతు భరోసా, తెలంగాణ ప్రజలకు అందించటం జరిగిందని చెప్పారు.

ప్రభుత్వం చేసిన పనులు మాత్రమే చెప్పుకొని ప్రజల్లోకి వెళ్లాలని అబద్దాలు చెప్పాల్సిన అవసరం మనకి లేదని, ఇవే కాకుండా నియోజకవర్గంకు ఇంటిగ్రెటెడ్ స్కూల్, 80 కోట్లతో రెండు అత్యాధునిక రోబోటిక్ ట్రైనింగ్ ఏటీసీ సెంటర్లు, యువత ఉపాధి యే ద్యేయంగా ప్రారంభం చేసి, అలాగే దశాబ్ద కాలంగా పట్టించుకోకుండా గ్రీసుకు కూడా నోచుకోని, డేంజర్ జోన్ లో ఉన్న కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు అభివృద్ధి చేశామని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డన మొదటి ఆరు నెలల్లోనే రూ.9.40 కోట్లతో మరమ్మతులు చేయించామని పేర్కొన్నారు. సీసీ రోడ్లు, విద్య, వైద్యం పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. ఖానాపూర్ నియోజకవర్గానికి ప్రత్యక శ్రద్దతో అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని, ప్రజలకు ఎల్లవేళలా కార్యకర్తలు, నాయకులు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని, భవిష్యత్ లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు వెలుతామని దిశా నిర్దేశం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *