Ambedkar Overseas: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, మార్చి 20 (మన బలగం): ఎస్సీ విద్యార్థులు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి బి.రాజ మనోహర్ రావు గురువారం ఒక ప్రకటనలో కోరారు. విదేశీ విశ్వ విద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిరహించనున్న ‘అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకము’ ద్వారా షెడ్యూల్డ్ కులములకు చెందిన విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షలు స్కాలర్షిప్ అందిస్తోంది. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా సింగపూర్ జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూజిలాండ్ విశ్వ విద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో చదవాలనుకుంటున్న ఎస్సీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
కావున విదేశాలలో చదువుకోవాలనే ఆసక్తి గల విద్యార్థులు మే 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో E-Pass website (www.telangana.epass.cgg.gov.in)లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షలతో పాటుగా వీసా, టికెట్ ఫెయిర్‌లను మంజూరు చేస్తారని వెల్లడించారు.
అభ్యర్థుల అర్హతలు: (1). రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎస్సీ కులమునకు చెందిన వారై ఉండాలి.
(2) సంవత్సర ఆదాయము రూపాయలు 5,00,000/- లోపు ఉండాలి.
(3) పీజీ చదవడానికి గ్రాడ్యుయేషన్‌లో 60% కంటే ఎక్కువ మార్కులు పొంది ఉండాలి.
(4) TOFEL/IELTS/GRE/GMAT లో ఎక్కువ శాతము అర్హత కలిగి ఉండాలి.
(5) PASSPORT నందు VISA అర్హత కలిగి ఉండాలి. (6) విదేశీ విశ్వ విద్యాలయముల నందు అర్హత పొంది ఉండాలి.
(7) ఒక కుటుంబం నుంచి కేవలం ఒక్కరు మాత్రమే ఈ పథకమునకు అర్హులు. ఇతర వివరములకై కార్యాలయ పని వేళలో 7989384801 నంబర్ సంప్రదించాలి.