Jyoti rao Phule Jayanti: రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 11 (మన బలగం): సిరిసిల్ల తెలంగాణ భవన్‌లో జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న, బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు తోట ఆగన్న మాట్లాడుతూ, వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే అని కొనియాడారు. కులం, జెండర్ వంటి సామాజిక రుగ్మతను రెండు శతాబ్దాలక్రితమే పసిగట్టి, పరిష్కారం కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు అని తెలిపారు.