Minster Duddilla: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ప్రమాదకరంగా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం రాత్రి కడెం ప్రాజెక్టును సందర్శించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి ఫ్లడ్ గేట్ల ద్వారా కిందికి వదలాలని సూచించారు. గత సంవత్సరం ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మంత్రి వెంట ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల, డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు, ఇరిగేషన్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.