Jagityal Collector: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్ట్ గేట్లును ఎత్తివేసి నీటిని విడుదల చేసినందున దిగువ పరివాహక ప్రాంతాల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు, చేపలు పట్టేవారు, పశువుల కాపరులు నదిలోకి దిగవద్దని కలెక్టర్ సూచించారు. ప్రజలు అధికారులకు సహకరించాలి అని తెలిపారు. 24 గంటలపాటు నీటి వనరులపై నిఘా పెట్టాలని సూచించారు. ముంపు ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.