local body elections: బుగ్గారం, ఏప్రిల్ 10 (మన బలగం): బీజేపీ ఆవిర్భావ వారోత్సవ కార్యక్రమంలో భాగంగా బుగ్గారం మండల అధ్యక్షులు మెడవేణి శ్రీధర్ ఆధ్వర్యంలో బీజేపీ క్రియాశీల సభ్యుల సమావేశం బుగ్గారం మండలంలోని సిరికొండ గ్రామంలో నిర్వహించడం జరిగినది ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అసెంబ్లీ కోకన్వీనర్ బండారి లక్ష్మణ్ మరియు మంచే రాజేష్ ఈ సమావేశంలో మాట్లాడుతూ గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలో పడవేసిందన్నారు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు హామీలతో అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన విధంగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తుందన్నారు. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో విధాల అభివృద్ధి సంక్షేమ పథకాలను తామే చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకుంటుందని ఇట్టి విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లవలసిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తపై ఉందని సూచించారు వీధి దీపాల నుండి మొదలుకొని స్మశాన వాటిక ల వరకు కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని గుర్తు చేశారు స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లాగా పని చేయాలని సూచించారు, ఈ కార్యక్రమంలో నక్క పరమేష్, బండారు సత్తయ్య, చిట్ల సునీల్, కప్పల నరేష్, సంపత్ రావు, పంచిత ధర్మరాజు, మల్లేష్, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, నక్కరాజు, ఆకుల రాజ్కుమార్, పల్లికొండ అనిల్, గడ్డం మహేష్, వర్కాపురం సతీష్, పేరుక తిరుపతి, మామిడాల నరేష్, తదితరులు పాల్గొన్నారు.